19-01-2026 12:00:00 AM
ముషీరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు అమల య్యాకే మున్సిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు పోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో అగ్గిపుట్టిస్తామని ఆయన హెచ్చరించారు. ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రేగ అరుణ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు పోవాలని ప్రభు త్వం ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమ న్నారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ల కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు, ఎన్నికలకు ఎలా పోతారని ప్రశ్నించారు.
కేసు తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా ఎన్నికలకు పోవడం బీసీలను దగా చేయడమే అని అన్నారు. ప్రభుత్వం మొదటి నుండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ ఊరించి మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేక వైఖరి మార్చు కోవాలని సూచించారు. అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వే షన్లను 28 శాతానికి కుదించారన్నారు.
బీసీలకు 65 మున్సిపాలిటీలకు గాను 35 స్థానాలు, కార్పొరేషన్‌లలో 10 స్థానాలకు 3 మాత్రమే కేటాయించారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని, న్యాయస్థానంలో కేసు తప్పకుండా గెలుస్తామని కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. కేసు కొలిక్కి వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, తెలంగాణ జూనియర్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, రాందేవ్ మోడీ, సతీష్, రాకేష్, రాజు నేత, చిక్కుడు బాల య్య, భీమ్రాజు తదితరులు పాల్గొన్నారు.