19-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జనవరి 18 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని నటరాజ్ నగర్లో ఆదివారం ఆయన పర్యటిం చారు.
పర్యటనలో భాగంగా రూ.15లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీవరేజ్ లైన్ పనులతో పాటు రూ.86లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.