29 April, 2026 | 6:11 PM

ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగేలా ఉంది

29-04-2026 03:25 PM

బోథ్,(విజయక్రాంతి): బోత్ మండల కేంద్రం సమీపంలోని కోరమండల్ ఎరువుల దుకాణం ముందర ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగేలా ఉందని సమీప దుకాణాల వారు అంటున్నారు. ఈదుగాలకు విద్యుత్ స్తంభం పడిపోక ముందే మరో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.