ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు కేయూ స్థలం కేటాయింపు తీర్మానం
హనుమకొండ, ఆగస్టు 18(విజయ క్రాం తి): కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు 15 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం పా లక మండలి సభ్యులు రాజు గౌడ్, సుధాకర్, సుదర్శన్, అనిత రెడ్డి, రమా రెడ్డి, సురేష్ లాల్,
బాలు చౌహాన్, నవీన్, సుకుమార్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్రం తదితరులు సెక్రటేరియట్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కలిసి ఈ విషయాన్ని వివరించారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు 15 ఎకరాల స్థలం కేటాయించడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, సహకారం అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.






