మృత్యు ఉచ్చులుగా మారిన విద్యుత్ స్తంభాలు
- వేలాడుతున్న తీగలు
- మృత్యువాత పడుతున్న పశువులు
- పట్టించుకోని విద్యుత్ అధికారులు
కోటపల్లి, ఆగస్టు 4 : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అటు మూగ జీవాలకు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. కనీస మరమ్మత్తులు చేపట్టకపోవ డంతో అనేక విద్యుత్ స్తంభాలు ఏటవాలు గా వంగిపోవడమే కాకుండా, కొన్ని చోట్ల నేలకూలే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రమాదాలను ముందుగానే అరికట్టాల్సిన అధికారు లు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు బలహీనపడి వంగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నప్పటికీ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ స్తంభాలు, తీగల కారణంగా ఇప్పటికే పలు గ్రామాల్లో పశువు లు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సం ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ విద్యుత్ శాఖ అప్రమత్తం కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రా ణ నష్టం సంభవించేలోపే ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలను వెంటనే మరమ్మత్తు చేసి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్య వైఖరిని వీడి అత్యవసర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.






