11 August, 2026 | 2:03 AM

ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంతో మేలు

11-08-2026 12:02 AM

కుటుంబ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయి  

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్నగర్ అర్బన్ ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ వాహనాల సైతం కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించేలా ఉంటున్నాయని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు.  నగరంలో సోమవారం రాయల్ ఇవి మోటార్స్ ను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, పర్యావరణ పరిరక్షణకు మధ్య తరగతి కుటుంబల ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జీరో పొల్యూషన్ -మెరుగైన భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాధ గోవర్ధన్ గౌడ్, గిరి గౌడ్, అబ్దుల్ హాక్, భవానీ ప్రజాప్రతినిధులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.