గ్రామ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
2 వార్డ్ మెంబర్ శ్రీకాంత్ నాయుడు
తుంగతుర్తి(విజయక్రాంతి): గ్రామ వీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ ద్యేయమని రెండో వార్డ్ మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన, రెండవ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన మురికి కాలువ లేకపోవడంతో చిన్న వానబడితే సైతం, రోడ్డు మొత్తం నీరు నిలబడి, దుర్గంధంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొద్ది రోజులుగా కాలువ మరమ్మత్తు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్, అధికారులకు చెబుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీనితో బుధవారం మధ్యాహ్నం గడ్డపారతో తోముతూ, పారతో మట్టిని తీసు కాలువ మురికి నీళ్లు బయటకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంకూరు సుదర్శన్, యాకన్న, రమేష్ కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి దవాఖాన పక్క సందులో నూతనంగా కాల్వ ఏర్పాటుకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని వీధివాసులు కాంగ్రెస్ నాయకులు, కోరుతున్నారు.






