1 July, 2026 | 6:53 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

ధర్మారంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ

01-07-2026 05:49 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శుభారంభం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల్కర్ బాలాజీ, ఉప సర్పంచ్ వెలిశాల శ్రీనివాస్ పాల్గొని భూమిపూజ నిర్వహించారు.

అలాగే వార్డు సభ్యులు కీసరి కావేరి, పొన్నం లక్ష్మి, తంగళ్లపల్లి సంధ్య, నక్క పరశురాములు, గంగుల ప్రశాంత్, దువ్వల అజయ్ హాజరయ్యారు.గ్రామపంచాయతీ కార్యదర్శి మనీషా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజాప్రతినిధులు తెలిపారు.