calender_icon.png 4 May, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగితాలకే అర్హతలు పరిమితం

03-05-2025 12:14:32 AM

తల్లాడ,మే2(విజయ క్రాంతి)అర్హత ఉన్న వారికి మొండి చేయి చూపిస్తుందని, ఇందిరమ్మ కమిటీ రాజకీయ నాయకులు అనుచరులు కే ఇల్లు అని, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామానికి వచ్చి న ఎంపీడీవో ను  గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టింది.

కానీ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో 40 ఇండ్లు మంజూరైన అనార్హులకే పథకం వరిచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్న వారికి, భూ స్వాములకు,గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వారికే ఇందిరమ్మ కమిటీ ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు మంజూరు చేశారని వారు ధ్వజమెత్తారు. నిరుపేదలకు మొండిచేయి చూపిందన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో నైనా  ఇల్లు వస్తాయని ఆశతో ఉన్న నిరాశ ఎదురైందని గ్రామానికి వచ్చిన ఎంపీడీవో సురేష్ కుమార్ ఎదుట ఆవేదన వెళ్ళగక్కారు. ఇప్పుడైనా సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ అర్హులైన వారికే ఇల్లు వచ్చే విధంగా  చొరవ తీసుకోవాలని  కమిటీ సెలక్ట్ చేసిన ఫైనల్ లిస్ట్ ని సరి చేసి అర్హులైన నిరుపేదలకు భూ మి లేని వారికే ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .