03-05-2025 12:14:43 AM
బీజేపీ నేత ఏనుగు సుదర్శన్‌రెడ్డి
మేడ్చల్, మే 2 (విజయ క్రాంతి): ఘట్కేసర్ మండలంలో జాతీయ రహదారిపై వివిధ చోట్ల అండర్ పాస్ ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.102 కోట్లు మంజూరు చేయడం హర్షనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఘట్కేసర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘట్కేసర్ జంక్షన్, ఎన్ టి పి సి, అంకుసాపూర్, మైసమ్మ గుట్ట వద్ద అండర్ పాస్ ల నిర్మాణం వల్ల ప్రమాదాలు తగ్గి సురక్షిత ప్రయాణానికి అవకాశం కలుగుతుందన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కృషి వల్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి, సహకరించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కు, ఎంపీ ఈటల రాజేందర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జంక్షన్ ల అభివృద్ధి వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
విలేకరుల సమావేశంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, దాసరి బాల నరసింహ యాదవ్, కట్ట మధుసూదన్ రెడ్డి, చెలక శ్రీధర్, అనిల్ గౌడ్, పవన్ సింగ్ పాల్గొన్నారు.