calender_icon.png 3 May, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎస్‌సీ జిల్లా టాపర్‌కు సత్కారం

03-05-2025 12:13:20 AM

 రాజేంద్రనగర్, మే 2: సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్ పల్లి డివిజన్ కాటేదాన్ శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థి పాపిశెట్టి కార్తీక్ జిల్లా టాపర్గా నిలిచాడు.

ఈ సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి అతడిని సత్కరించారు. కార్తీక్ రంగారెడ్డి జిల్లాలో టాపర్ గా నిలవడం అదృష్టమన్నారు. అతడు తమ డివిజన్ విద్యార్థి కావడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు.

శాంతినగర్ స్కూల్ ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ కి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థికి ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవితో  పాటు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.