అర్హులైన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, జూలై 7: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ ప్రాంత అభివృద్ధితో పాటు ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో అలంపూర్ మండలం లింగన్వాయి గ్రామానికి చెందిన జి. తిరుపాలు వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ప్రతిని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే విజయుడు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరం కాకుండా ఎందుకు మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని వాటినిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






