గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు రావాలి
08-07-2026 12:00 AM
అలంపూర్, జూలై 7: ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపు ణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మానవపాడు ఎంఈవో శివప్రసాద్ సూచించారు. బోరవెల్లి, జల్లాపురం ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక అభ్యసన నైపుణ్యాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యా యులకు సూచించారు.






