13 July, 2026 | 1:59 AM

అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలి

13-07-2026 12:00 AM
  1. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో 
  2. బీఆర్‌ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలి 
  3. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, జూలై 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా బీఆర్‌ఎస్ నాయకులు చూడాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ఎమ్మెల్యే తమ నివాసంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ...

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా మన నాయకులకే అవగాహన కల్పించారనిగుర్తు చేశారు.  ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని, దానిలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కోసం అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఎన్నికల అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ప్రచారం

బడంగ్‌పేట్, జూలై 12 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు సుభాన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వార్డు నెం. 57 నాదర్గుల్లో ఓటర్ నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

యువతను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం, ప్రతి ఇంటికి వెళ్లి ఫారం-6, ఫారం-8లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సుభాన్ యాదవ్ మాట్లాడుతూ ‘యువతే దేశ భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ ఇస్తుంది. అందుకే అందరూ కాంగ్రెస్ జెండా కిందకు రావాలని‘ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, మరాఠీ నర్సింగ్ రావు  కార్యకర్తలు పాల్గొన్నారు.