calender_icon.png 12 June, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎల్లమ్మ’ పూజ ఫిబ్రవరిలోనే..

12-10-2024 01:23:05 AM

వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమా గత ఏడాది చిన్న చిత్రంగా బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ చిత్రం ఏకంగా దర్శకుడి ఇంటిపేరునే మార్చేసింది. అలా ‘బలగం’ సినిమా తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన వేణు యెల్దండి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే ‘బలగం’ను నిర్మించిన దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లోనే తన కొత్త సినిమా రానుందని వేణు ఇప్పటికే ప్రకటించారు. ‘బలగం’ రిలీజైన వెంటనే వేణు.. మరో పాయింట్‌ను దిల్‌రాజుకు చెప్పారు. తనకు నచ్చిందని, పూర్తి కథను నెరేట్ చేయమని ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అది కూడా పూర్తయ్యింది.

‘ఎల్లమ్మ’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్‌తోనే వస్తోందని తెలుస్తోందట. అందుకు కారణం.. కథకున్న డిమాండ్ అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఈ ప్రాజెక్టు ఫిబ్రవరిలో ప్రారంభం కానుందనే విషయం తాజాగా ఓ ఈవెంట్ వేదికపై దర్శక నిర్మాతలిద్దరి సరదా సంభా షణ ద్వారా తెలిసింది.

అవకాశం ఉన్న ప్రతిచోటా ఒక్కో విషయాన్ని వెల్లడించడమనేది ‘ఎల్లమ్మ’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు పెంచేందుకు దర్శకనిర్మాతలు చేస్తున్న ప్రయత్నంలో భాగమే నని అర్థమవుతోంది.