12-10-2024 01:22:04 AM
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దేవర సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. దేవర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీక్వెల్లో బాలీవుడ్ స్టార్స్ కొందరు ఉండే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంటర్వ్యూలో కొరటాల స్పందించారు.
“దేవర 2లో రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం తీసుకుంటే బాగుంటుంది. మరి వారిని తీసుకోగలమా? లేదా? అనే విషయాలు తెలియకుండా నేనేమీ చెప్పలేను. ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల పేర్లు చెబితే ఊహాగానా లు ప్రారంభమవుతాయి. సినిమాలో అతిథి పాత్రలే కీలకం. అతిథి పాత్రలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తా” అని కొరటాల శివ పేర్కొన్నారు.