calender_icon.png 6 December, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బిజెపి జిల్లా కార్యాలయంలో ఘన నివాళి

06-12-2025 09:55:10 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా, హన్మకొండలో ఉన్న బిజెపి జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి హన్మకొండ జిల్లా మాజీ  అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, బిజెపి నాయకులు, పరకాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డా.పగడాల కాళీప్రసాదరావు హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రతకు, సామాజిక న్యాయానికి మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, రావు అమరేందర్ రెడ్డి,జిల్లా నాయకులు కందగట్ల సత్యనారాయణ,నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, బైరి శ్రావణ్, సంపత్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, వివిధ డివిజన్ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.