యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో స్వచ్ఛభారత్
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ క్యాంపస్ లో ఉన్న చెత్తను తొలగించారు. దాదాపు 200 మంది విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఎండను సైతం లెక్కచేయకుండా పేరుకుపోయిన చెత్తను తీసివేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నిర్మల మాట్లాడుతూ... చదువుకున్న విశ్వవిద్యాలయం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే విద్యార్థికి ప్రశాంత దొరుకుతుందని ప్రశాంతమైన వాతావరణo ఉన్నప్పుడే విద్యార్థి సృజనాత్మక ఆలోచన విధానం ఏర్పడుతుందని అందుకే చదువుకునే పరిసర ప్రాంతాలను ఎవరికి వారే శుభ్రంగా ఉంచుకోవాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు.
నేటి యువత శారీరక శ్రమ లేకపోవడం వల్ల దృఢంగా ఉండకపోవడం వల్ల అనేక రుగ్మతలకు గురికావాల్సి వస్తుందని ఇలాంటి శారీరక శ్రమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వ్యక్తిగతంగా విద్యార్థి మంచి ఫిట్నెస్ ఉండటంతో పాటు సమాజానికి తను చేసిన శ్రమ వాళ్ళ ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ స్వచ్ఛభారత్ ప్రోగ్రాం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బైరి నిరంజన్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓ.రవీందర్, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ మధుశ్రీ, డాక్టర్ మల్లేష్ , డాక్టర్ రమాదేవి, డాక్టర్ వీరేందర్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ భాగ్యమ్మ డాక్టర్ రాంబాబు, డాక్టర్ దేవజి నాయక్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సరిత, శ్రీమతి రజిత, డాక్టర్ నవీన్, డాక్టర్ శంకర్ మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.






