17 April, 2026 | 9:48 PM

Breaking News

శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •  

కూసుమంచిలో కాంగ్రెస్ నిరసన జ్వాల

17-04-2026 08:44 PM

బిజెపి ఎంపీ తేజశ్రీ సూర్య దిష్టిబొమ్మ దగ్ధం 

కూసుమంచి,(విజయక్రాంతి): తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ కూసుమంచి మండలంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలో క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హఫీజుద్దీన్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు మంకెన వాసు, డిసిసి జిల్లా కార్యదర్శి గొల్లపూడి వీరన్న, సర్పంచులు కొండా కృష్ణవేణిమహిపాల్, వడిత్య వెంకటేష్ నాయక్, బాణోతు నాగేశ్వరరావు, బాణోతు రవి, జర్పుల శ్రీను నాయక్, కంచర సైదమ్మ-కొండల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి, బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జూకురి గోపాలరావు, మాజీ సర్పంచులు చెన్ను మోహన్ రావు భారీ వీరభద్రం, గుండా దామోదర్ రెడ్డి, చాట్ల పరుశురాం, ఉపసర్పంచ్ చెన్ను వెంకటరమణ, కంచర్ల పవన్ రెడ్డి, కంచర్ల సుధీర్ రెడ్డి,శ్రీను, లోక, మీరా, సురభి, కుమార్, చంద్రయ్య, మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ బెల్లంకొండ శరత్, శేఖర్ రెడ్డి మరియు,కార్యకర్తలు పాల్గొన్నారు..