calender_icon.png 10 May, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం జోక్యం చేసుకోం

10-05-2025 02:50:01 AM

  1. భారత్-పాక్ శాంతియుతంగా ఉండాలి
  2. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

న్యూఢిల్లీ, మే 9: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాము కలగజేసుకోమంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చిచెప్పారు. రెండు దేశాలూ శాంతియు తంగా ఉండాలని ఆయన సూచించారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లా డాతూ ఈ మేర కు కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.

‘రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ.. భారీ సంక్షో భం దిశగా పయనించడంపై మేం ఆం దోళన వ్యక్తం చేస్తు న్నాం. సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు చక్కబడాలని కోరుకుటుంటున్నాం. పాకిస్థాన్‌పై భారత్‌కు కొన్ని ఫిర్యా దులున్నాయి. న్యూఢిల్లీ చర్యలకు పాక్ స్పంది స్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేం వీరిని ప్రోత్సహించగలమే తప్ప, యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు.

అమెరికాతో దానికి ఏ మా త్రం సంబంధం లేదు’ అని వాన్స్ వెల్లడించారు. అయితే, తాను, అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. జేడీ వాన్స్ తన కుటుంబంతో భారత పర్యటనకు వచ్చిన సందర్భంలోనే పహల్గాం ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.