15 May, 2026 | 3:05 AM

ప్రభుత్వ విద్యపై ప్రత్యేకశ్రద్ధ

21-06-2024 12:07 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూన్20 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జాతీ య నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వేములవాడలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీలో ఆయ న అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుతం గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న దని చెప్పారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయి లో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.