15 May, 2026 | 4:24 AM

ఛత్రపతి శివాజీ ఆశయాలను సాధిద్దాం

21-06-2024 12:07 AM

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, జూన్ 20 (విజయక్రాంతి): చత్రపతి శావాజీ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో శివాజీ పట్టాభిషేక వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్యం కోసం శివాజీ ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు. యువత మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. దేశంలో హిందువు లందరు జాగృతం కావాలని పిలుపు నిచ్చారు. నిర్మల్ జిల్లా పని చేస్తున్న ఓ పోలీసు ఉన్నతఅధికారి ఒకే వర్గంపై కేసులు పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు కేసుల విషయంలో సమగ్ర విచారణ జరుపకుండా సంబం దం లేని చట్టం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అధికారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.