కల్వకుంట్ల కుటుంబ పాలనతో రాష్ట్రం వెనుకబాటు
21-06-2024 12:08 AM
ఎంపీ మల్లు రవి
గద్వాల (వనపర్తి), జూన్ 20(విజయక్రాంతి): కల్వకుంట్ల కుటుంబ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీమల్లు రవి గురువారం గద్వాల జిల్లా కేంద్రం రావడంతో జడ్పీ చైర్‌పర్సన్ సరిత ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్ కూడలిలో ఎంపీ మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన లో తెలంగాణ వెనకబాటుకు గురైందని విమర్శించారు. గద్వాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు సేవకుడిగా పని చేస్తాన న్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. నిరంకుశ ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు.






