20-07-2025 12:08:04 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. దర్శకుడు గౌత మ్ తిన్ననూరి దీన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటి స్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేసిన గ్లింప్స్ సినీప్రియుల దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. పాటలకూ మంచి స్పందన దక్కింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది.
అయితే, ఈ సినిమా హిందీ వెర్షన్‌కు టైటిల్ మార్చిన ట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. ‘కింగ్‌డమ్’ పేరుతో ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ సినిమా రిజిస్టర్ అయి ఉండటమే ఇందుకు కారణం.