11 July, 2026 | 1:52 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల నిరసన

11-07-2026 12:00 AM

కల్వకుర్తి, జూలై 10: తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్  పరిధిలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్  జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

పెండింగ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.వివిధ కేడర్ల ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను పూర్తి చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటైన ఆసుపత్రులకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులను ముందుగానే జారీ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా. శివరామ్, డా. రోహిత్, నర్సింగ్ సూపరింటెండెంట్ శిరోమణి, హెడ్ నర్స్ ఉమా, వెంకటస్వామి, శిరీష, భారతి, కావ్య, రహీమ్, కిరణ్మయి, ఫ్లోరా, శ్రీకాంత్, సునీత, అబ్బాస్, రమేష్తో పాటు నర్సింగ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.