11 July, 2026 | 1:52 AM

జనగణనలో కులగణనతో మోసం!

11-07-2026 12:00 AM

ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి

బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

ప్రధాని మోదీకి మేధావుల లేఖ 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సం యుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జనగణనలో కులగణన మోసపోతున్న బీసీలు అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు (రిటైర్డ్ ఐఏఎస్) మాట్లాడుతూ.. రెండో దశ జనగణనకు సంబంధించిన ప్రశ్నావళిపై 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రీ-టెస్టింగ్ జరుగుతోందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు ముందుగానే కేటాయించిన యూనిక్ కోడ్ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ, మిగతా కులాల విషయంలో ఓపెన్-ఎండెడ్ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కులానికి ప్రత్యేక యూ నిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి రాసిన లేఖను విడుదల చేశారు.

బీసీలకు మోసం: పూర్ణ చంద్రరావు

ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్ పూర్ణ చందర్‌రావు (మాజి డీజీపీ) మాట్లాడుతూ.. ప్రభుత్వాలు బీసీలను దశాబ్దాలుగా మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ లేదా కుల కోడ్ కేటాయించ కుం డా జనగణన నిర్వహిస్తే బీసీలకు తీవ్ర అన్యా యం జరుగుతుందని హెచ్చరించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు మాట్లాడుతూ, బీజేపీ బీసీ ఎంపీ లు, వెంటనే స్పందించి రాబోయే పార్లమెం ట్ సమావేశాల్లో  లేవనెత్తాలని కోరారు. ఈ స మావేశంలో దుర్గయ్య గౌడ్, కిరణ్ కుమా ర్, ఐలి వెంకన్న, ఎర్రమాద వెంకన్న, సింగం నగే టష్,నాగభుషణం తదితరులు పాల్గొన్నారు.