calender_icon.png 3 December, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలి

03-12-2025 12:00:00 AM

* ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

పటాన్ చెరు, డిసెంబర్ 2 :అభివృద్ధి కార్యక్రమాల అంశంలో పరిశ్రమలు తమ సామాజిక సేవ పథకం ద్వారా మరిన్ని నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

మంగళవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో శాండ్విక్ పరిశ్రమ సౌజన్యంతో కోటి రూపాయలతో చేపట్టిన ఆర్వో వాటర్ ఏటీఎం, బయో కంపోసిట్ కేంద్రం, అంగన్వాడి ప్రాథమిక పాఠశాలలపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్, సోలార్ స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిక్ చెత్త సేకరణ ఆటోలను ఆయన ప్రారంభించారు.

అనంతరం ముత్తంగి డిఎన్ కాలనీ నుండి పాశమైలారం 100 ఫీట్ల రహదారి వరకు రెండు కోట్ల పదిలక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి మరియు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్తంగి అభివృద్ధి కోసం శాండ్విక్ పరిశ్రమ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం అందించే నిధులతోపాటు నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమల సిఎస్‌ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, శాండ్విక్ పరిశ్రమ సిఎస్‌ఆర్ రెడ్డి రవి అరోరా, సీనియర్ నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ పాల్గొన్నారు.