12 May, 2026 | 11:49 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

లక్క సేకరణతో ఆదివాసీలకు ఉపాధి

25-04-2026 12:17 AM

లక్క సాగుపై దృష్టి సాధించిన వన సౌరక్షణ సమితిలు

ఉట్నూర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరికే లక్క ను సేకరిం చి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో అడవి ప్రాం తంలో విరివిగా దొరికే మోదుగ చెట్లపై  లక్క పంట సాగు చేస్తూ... ఉపాధిని పొందుతున్నారు. అటవీ శాఖ అధికారులు  మోదుగ చెట్టుపై లక్క పంట పెంచేందుకు ఝార్ఖండ్, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి లక్క విత్తనాలు తీసుకువచ్చి వన సౌరక్షణ సమితి ల ద్వారా మోదుగ చెట్లపై సాగు చేస్తున్నారు.

లక్క సాగుపై అటవీ శాఖ అధికారులు  గిరిజనులకు వన సౌరక్షణ సమితి ల ద్వారా  అవగా హన కల్పించారు. దీంతో అడవి శాఖ అధికారులు సరఫరా చేసే లక్క విత్తనాలను అడవిలోని మోదుగ చెట్లపై లక్క విత్తనాలను కర్రల సాయంతో కట్టేశారు. చెట్లపై కట్టిన లక్క విత్తనం చెట్టుపై కొమ్మ కొమ్మకు లక్క రావడంతో గిరిజనులకు ఉపాధి సౌకర్యం కలుగుతుంది. అదిలాబాద్ జిల్లాలోని నా ర్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ రూలర్, తదితర మండలాల పరిధిలోని మారుమూల అడవి ప్రాంతంలో గల మోదుగ చెట్లపై లక్క సాగు చేస్తున్నారు.

కేజీ రూ.300 నుండి 400లకు విక్రయం... 

అడవి ప్రాంతంలోని మోదుగు చెట్లపై సాగుచేసిన లక్క బయట మార్కెట్లో  . 300 నుండి 400 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అడవి శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే లక్క విత్తనాలను వి.ఎస్.ఎస్ ద్వారా మోదుగు చెట్లపై విత్తనాలను కట్టడంతో ఒక చెట్టు నుండి నాలుగు కేజీల వరకు లక్క గిరిజనులకు అందుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడవిలో ఉండే మోదుగ చెట్లు గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు ఎంతో మేలైన ఆకులను అందిస్తుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సేకరించి లక్క ను  జార్ఖండ్, చతిస్గడ్ నుండి  వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

లక్క సాగుతో గిరిజనులకు ఉపాధి

ఇంద్రవెల్లి అటవీ శాఖ పరిధిలోని నార్నూర్ మండలంలోని చోరుగావ్, సుంగాపూర్, ఖడికి తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలోని మోదుగ చెట్లపై సాగు చేస్తున్న లక్క తో గిరిజనులకు ఉపాధికి సౌకర్యం కలిగిందని ఎఫ్‌ఆర్‌ఓ సంతోష్ అన్నారు. మోదుగ చెట్లను రక్షించడంతో గిరిజనులకు ఉపాధితో పాటు శుభకార్యాలకు మోదుగ ఆకుల ఇస్తారులు ఎంతో ఉపయోగంగా ఉంటాయని ఎఫ్ ఆర్ ఓ అన్నారు. వేసవికాలంలో  మోదుగ ఆకులను తలపై ప్రయాణం చేస్తే వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుందని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.

 ఎఫ్‌ఆర్‌ఓ, ఇంద్రవెల్లి