25 April, 2026 | 1:56 AM

హెచ్‌ఎంలకు పదోన్నతులు కల్పించాలి

25-04-2026 12:19 AM
  1. పోరాట కార్యాచరణను ప్రకటించిన ప్రధానోపాధ్యాయుల సంఘం
  2. నేటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి హేమ చంద్రుడు, ముఖ్యసలహాదారు డా.పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని సర్వీస్ రూల్స్, పదోన్నతులు, ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరాట కార్యాచరణను శుక్రవారం ప్రకటించారు.

మొదటి దశలో వివిధ స్థాయిలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించడం, రెండో దశలో జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం, మూడో దశలో రాష్ట్రస్థాయిలో నిరస న కార్యక్రమాలను చేపడతామని వారు తెలిపారు. తొలిదశలో భాగంగా ఈ నెల 25 నుంచి మే 31 వరకు ప్రజాప్రతినిధుల దృష్టి కి తమ సమస్యలను తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సీఎం, సీఎస్‌ను కూడా కలిసి వారి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తామన్నారు.