calender_icon.png 2 July, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కోట్లతో ఉపాధి ప్రోత్సాహకాలు

02-07-2025 12:59:01 AM

  1. ఆమోదముద్ర వేసిన కేంద్ర క్యాబినెట్
  2. ప్రైవేటు రంగ పరిశోధన అభివృద్ధి పథకానికి లక్ష కోట్లు
  3. జాతీయ క్రీడా పాలసీ విధానానికి పచ్చజెండా

న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర క్యాబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పనకు, ఉపాధిని, సామాజిక భద్రతను పెంచడానికి రూ. 1.07 లక్షల కోట్ల వ్యయంతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్రం ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

ఉత్పాదక రంగానికి ప్రాధాన్యమిస్తూ కొత్తగా తొలిసారి ఉద్యోగాల్లో చేరే వారికి ప్రోత్సాహకాలు.. మొదటిసారి ఉద్యోగంలోకి వచ్చే వారికి రెండు విడతలుగా 15వేలు ప్రోత్సాహకం అందిం చనున్నారు. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పరిశో ధన-అభివృద్ధి-ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెం చడం, క్రీడాకారుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం-2025కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. తమిళనాడులోని పరమకుడి-రామనాథపురం హైవే నాలుగు లేన్ల విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణానికి రూ. 1853 కోట్లు కేటాయించించామన్నారు.

రెండేళ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు..

వచ్చే రెండేళ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కొత్త పథకం తీసు కొచ్చామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో దేశంలోని 4 కోట్ల 10 లక్షల మంది యువతకు నైపుణ్యం, ఇతర అవకాశాలు, ఉద్యోగాల కల్పన కోసం 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రధాని మోదీ ప్యాకేజీతో కూడి ఐదు పథకాలను ప్రకటించారని పేర్కొన్నా రు.

రెండేళ్ల కాలపరిమితిపై  రూ. 99,446 కోట్లతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్‌ఐ) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగాలు కల్పించే యజమానులకు రెండేళ్ల పాటు ప్రతి నియామకానికి నెలకు రూ.3వేలు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. కనీసం ౬ నెలల పాటు యజమానులు వారి వారి సంస్థల్లో ఉద్యోగాలను కొనసాగిస్తామన్నారు.

ఉద్యోగంలో చేరిన తొలి ౬ నెలలు పూర్తయ్యాకా మొదటి కిస్తీ, 12 నెలలు పూర్తయిన తర్వాత రెండో కిస్తీ.. వస్తూత్పత్తి రంగంలో అదనపు ఉద్యోగాల కల్పన కోసం, యాజమానులకు రెండేళ్ల పాటు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు..

పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల రంగం లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్డీఐ పథకానికి ఆమోదం తెలిపింది. రూ. లక్ష కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్డీఐలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్స హించేందుకు తక్కువ వడ్డీ రేటు లేడా వడ్డీ రహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడమే పథకం లక్ష్యమని కేం ద్ర పేర్కొంది.