02-07-2025 04:03:11 PM
నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు
కుకునూరుపల్లి: పార్టీ విధేయులకే అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, అది బీజేపీ పార్టీకే సాధ్యమని బీజేపీ సీనియర్ నాయకులు సదానంద గౌడ్(Senior BJP leader Sadananda Gowda) అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నిక అయినా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత, ప్రజలు, రైతులు ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయినా బిజెపి పార్టీ వైపు ఉన్నారన్నారు. రెండు రాష్ట్రా లలో పార్టీనీ అన్ని ఎన్నికలలో విజయం దిశగా ముందుకు వెళ్తుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీని మండలం లో గెలుపు దిశగా నడిపించాలన్నారు.