calender_icon.png 2 July, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి సరే.. రోడ్డు ఏది మరి?

02-07-2025 12:40:20 AM

అధికారుల అనాలోచిత విధానానికి నిలువుటద్దం 

భద్రాద్రి కొత్తగూడెం జూలై1 (విజయక్రాంతి) అధికారుల అనాలోచిత విధానానికి అ ద్దం పడుతుంది పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీలో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం.వెంగళరావు కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు మె రుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 2021లో  727 /24 సర్వే నంబర్లు లో 450 అడుగుల భూమిని పట్టణ ఆరోగ్య కేంద్రం కి కేటాయించారు.

ఆ స్థలంలో వైద్య ఆరోగ్యశాఖ నిధులు రూ 18 లక్షల వ్యయంతో ఆసు పత్రి నిర్మాణాన్ని చేపట్టి ఇటీవల పూర్తి చేశా రు. ఆసుపత్రి నిర్మాణం అయితే పూర్తయిం ది కానీ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడం శోచనీయం. భవన నిర్మాణం పూర్తయి రెండు నెలలు కావస్తున్న నేటికీ ప్రా రంభోత్సవానికి నోచుకోలేదు. అందుకు ప్ర ధాన కారణం ఆసుపత్రి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడమే.

దీంతో వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్న ఆ రెండు కాలనీల ప్రజలకు నిరాశే మిగిలింది. వాస్తవంగా ఆ స్థలం ఎస్త్స్రన్మెంట్ భూమి. ఆసుపత్రిని రోడ్డు పక్కన నిర్మించాల్సి ఉండగా వెనక భాగంలో నిర్మించడం వల్లనే సమస్య తలెత్తింది. ఇప్పటికైనా అధికారులు ఆస్పత్రి వర కు రోడ్డు నిర్మాణం చేపట్టి ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. 

మున్సిపల్ నిధులతో రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం 

ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, రోడ్డు నిర్మాణం, వీధి దీపాల కోసం మున్సిపల్ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సాంబశివరావు మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిధులు మంజూరు అయితే రోడ్డు వీది దీపాలు ఏర్పాటు జరుగుతుందన్నారు.

- ఐటీడీఏ డిఇ మధు

నిర్మాణంలోనే లోపం 

727/24 సర్వేనెంబర్ లో నాలుగు ఎకరా ల ఎస్త్స్రన్మెంట్ భూమి ఉంది. ప్రభు త్వం ఆసుపత్రి నిర్మాణం చేసే సమయం లో రోడ్డు పక్కన నిర్మించకుండా, వెనక భాగం లో స్థలం కేటాయించడమే సమస్యకు మూ లమైంది. భవనం అయితే నిర్మించారు.. రోడ్డు నిర్మాణం మరిచారు అన్న చందాన పరిస్థితి ఉంది. తక్షణమే ఆసుపత్రికి వెళ్లేందు కు పక్కా రోడ్డు నిర్మించాలని, ఆస్పత్రి చుట్టూ గోడ నిర్మాణం చేపట్టాలి. 

- ఆరుద్ర సత్యనారాయణ వెంగళరావు కాలనీ