02-07-2025 04:08:38 PM
బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి సమీపం లో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి బుధవారం పట్టణ అధ్యక్షులు బొనగిరి చంద్రం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఆదేశానుసారం మండల కేంద్రంలో జూలై 7వ తేదీన ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని వర్గాల వారితో కలిసి ఘనంగా నిర్వహించటం జరుగుతుంది అని తెలిపారు. సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ ఆశయాల ను నెరవేర్చడానికి మండలంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వారు పిలునిచారు. మండలంలోని అన్ని గ్రామలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయాలని తెలిపారు.