ప్రయాణ సమయంలో రోడ్డు నియమాలు తప్పక పాటించాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : ప్రయాణ సమయంలో తల్లితండ్రులు రోడ్డు నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తల్లితండ్రు లకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమం లో భాగంగా సూర్యాపేట పట్టణ, సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంను 3వ రోజైన బుధవారం సూర్యాపేట పట్టణంలో గల సిటీ టాలెంట్ హై స్కూల్ లో నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యార్థులకు ఏర్పా టు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. రోడ్లపై ప్రయాణ సమయం లో అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నిర్ల క్ష్యం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎవరైనా తప్పుడు మార్గాలు సూచించిన తప్పుడు పనులకు ప్రోత్సహించిన వాటిని ఉపాధ్యాయుల దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
తల్లిదండ్రులతో పాటు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరిం చాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆజాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియ మాల గురించి రోడ్లపై పాటించాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని హెల్మెట్ వాడడం, సిట్ బెల్ట్ ధరించడం గురించి వివరించాలన్నారు.
తదుపరి రహదారి వినియో గంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి పట్టణ సి ఐ వెంకటయ్య, సూర్యాపేట ఎసిపి ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి జయప్రకాష్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. తదుపరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కృ ష్ణయ్య, విద్యా సంస్థల కరెస్పాండంట్ ప్రకాష్,పాల్గొన్నారు.






