calender_icon.png 19 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీబీ జీ రామ్ జీకి లోక్‌సభ ఆమోదం!

19-12-2025 12:06:51 AM

  1. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి విపక్షాల నిరసన

వివాదాలు, నినాదాల నడుమ ఓటింగ్

సభలోనే బిల్లు ప్రతుల చించివేత 

మూజు వాణి ఓటుతో బిల్లుకు ఆమోదం 

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అభ్యంతరం

గందరగోళం నేపథ్యంలో సభ నేటికి వాయిదా 

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ (’వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ -గ్రామీణ్) పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. అయితే, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

వారి ఆందోళన నడు మ స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించ గా.. బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్షాలు పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టాయి. కొందరు ప్రతిపక్ష నేత లు ’వీబీ జీ ’రామ్ జీ’ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మాట్లాడుతూ.. ‘కాగితాలను చించివేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు. దేశం మిమ్మల్ని చూస్తోంది.’ అని విపక్ష సభ్యులను హెచ్చరించారు. ఈ గందరగోళం నేపథ్యంలో స్పీకర్ లోక్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

లోక్‌సభలో రభస

కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, డీఎంకే నాయకులు టీఆర్ బాలు, సమాజ్‌వా దీ పార్టీ నాయకులు ధర్మేంద్ర యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల సభ్యులు.. ‘వీబీ జీ రామ్ జీ’  బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా సభలో ఆందోళన చేపట్టారు. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే జాతిపితను అవమానించడమేనని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుతో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని ఆరోపించారు.

పేర్లు మార్చే దురుద్దేశం ప్రతిపక్షాలదే 

పేర్లు మార్చాలనే ఉద్దేశం కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్షాలపై విరుచుకుప డ్డారు. ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లును సమర్థించిన కేంద్రమంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలకు నెహ్రూ పేరును పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని విమర్శించారు.

2009 ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని మహాత్మాగాంధీ పేరును నరేగా(ఎన్‌ఆర్‌ఈజీఏ)లో చేర్చారని కేంద్రమంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వానికి పేర్లు మార్చాలనే దురుద్దేశం ఉందంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం కేవలం పనిపై మాత్రమే దృష్టి పెడుతోందని చెప్పుకొచ్చారు. అందరితో చర్చించిన తర్వాతే కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

‘ఉపాధిహామీ’ పేరు మార్చొద్దు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ను రద్దు చేసి ‘వికసిత్ భారత్ రోజ్ గార్, ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్  ( వీబీ-జీ రామ్ జీ ) బిల్లు -2025ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా గురువారం కాంగ్రెస్ అధిష్ఠా నం పిలుపుమేరకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపారు.

ఉపాధి హామీ పథకం రద్దు, జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగింపును తీవ్రంగా ఖండించారు. నిధుల ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై వేయబోతున్న వీబీ జీ రామ్ జీ పథకం వద్దే వద్దు అంటూ..ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. పేద రాష్ట్రాలు ఆర్థిక భారాన్ని భరించలేవని, పేదలకు అండగా నిలుస్తున్న ఈ పథకాన్ని చివరకు రద్దు చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీలు మల్లు రవి, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం: ప్రియాంక గాంధీ

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు వలన రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని ప్రియాంక గాంధీ   అన్నారు. సభ వాయి దా పడిన తరువాత పార్లమెంట్ వెలుప ల ప్రియాంకగాంధీ  మీడియాతో మాట్లాడారు.  ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లును  ప్రతి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు.

‘బిల్లులోని వివరాలను చదివిన ఎవరికైనా గ్రామీణ ఉపాధి హామీ పథ కం ఎలా పూర్తి కాబోతోందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బం ది పడే అవకాశం ఉంది.  పథకం పేదల కు అండగా ఉండేది. కానీ, ఇప్పుడు కేం ద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పేదలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.’ అంటూ కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.