13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే క్రీడాకారులకు ప్రోత్సాహం

23-03-2026 12:05 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే క్రీడాకా రులకు తగిన ప్రోత్సాహం లభించిందని ఘట్ కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి అన్నారు. ఎదులాబాద్ డివిజన్ పరిధి మర్రిపల్లిగూడలో జరుగుతున్న ఎంపీఎల్ సీజన్-6 క్రికెట్ క్రీడా  పోటీలు ముగిశాయి. మల్లారెడ్డి సేవా ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు నగదు బహుమతితో పాటు ఆకర్షణీయ ట్రోఫీలను కొండల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత మంది యువకులు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, అవుషాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య యాదవ్, మర్పల్లిగూడ బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీలు కృష్ణమూర్తి, మంకం రవి, మాజీ వార్డు సభ్యులు వీరేశం, బొడిగే శ్రీనివాస్, క్రీడాకారులు నర్సింహ, యాదయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.