1 March, 2026 | 1:46 AM

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

01-03-2026 12:00 AM
  1. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు చర్యలు
  2. ప్రజలకు చేరువగా సాంకేతికత 
  3. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  4. మంథనిలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఎక్స్ పో 

మంథని, ఫిబ్రవరి -28 (విజయక్రాంతి) : నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. శనివారం మంథని పట్టణంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్ పో-2026 కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రీమ్, రైస్, స్టార్ట్  నినాదంతో ఇన్నోవేషన్ ఎక్స్ పో 2026 ను మంథని లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

మంథనిలో ఉన్న టీ- వర్క్స్ యూనిట్ బృందం కలెక్టర్ సమకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటిస్తూ విద్యార్థులు నూతన ఆవి ష్కరణ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేశారని అన్నారు. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతా లకు విస్తరిస్తున్నామని, టైర్ 2, టైర్ 3, రూరల్ ప్రాంతాలకు కూడా ఐటీ, ఏఐ ఆధారిత రంగా లు విస్తరించడం వల్ల 2034 నాటికి తెలంగాణ ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

పిల్లల ఆ లోచనలను పదును పెట్టేందుకు డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కృషి చేస్తుందన్నారు. మంథని లోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫిడర్, ఆధునిక హెల్మెట్ తయారి వంటి  అనేక ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.

కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ టీ-వరక్స్ యూనిట్‌ను 7 నెలల క్రితం మంథని లో ప్రారంభించామని, ఇక్కడ పిల్లలు అనేక నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారన్నారు. టీ వర్క్స్ సిఈఓ జోగేందర్, ము న్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్‌రెడ్డి, ఆర్డీవో సురేష్, తహసీల్దార్ అరీపుద్దీన్, మున్సిప ల్‌కమిషనర్ మనో హర్ పాల్గొన్నారు.