calender_icon.png 1 July, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిమంతులకు ప్రోత్సాహం

01-07-2025 01:31:06 AM

-నిర్లక్ష్యం  చేసేవారికి పనిష్‌మెంట్ 

-ఇది కామారెడ్డి పోలీస్ బాస్ ట్రీట్‌మెంట్

కామారెడ్డి, జూన్ 30(విజయ క్రాంతి), పనిచేసే వారికి మరింత ప్రోత్సహాన్ని ఇస్తూ పనిలో నిర్లక్ష్యం చేసే వారికి పనిష్మెంట్ ఇస్తూ కామారెడ్డి జిల్లాలో పోలీస్ బాస్ వచ్చిన 100 రోజుల్లో జిల్లాలోని పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ముందుగా సమాచారం ఇచ్చిన వారికి అండగా నిలుస్తూ విధుల్లో ఇబ్బందులు ఎదురైన ఎలా ముందుకెళ్లాలని విషయాలను పోలీస్ బాస్ చర్చిస్తూ పని చేసే పనిమంతులకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా సలహాలు సూచనలు చేస్తున్నారు.

పని చేసే వారికి ధైర్యం ఇవ్వడమే కాకుండా పనులు చేసే లా ప్రోత్సహిస్తున్నారు. విధులలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా కేసుల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా అధికారులను గుర్తిస్తూ వారికి పనిష్మెంట్ సస్పెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికే వంద రోజుల్లో పదిమంది పోలీస్ లకు పనిష్మెంట్ ఇచ్చారు. వీరిలో ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హేడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

బాధ్యతలు చేపట్టిన నుంచే పోలీస్ స్టేషన్ల తనికి 

కామారెడ్డి జిల్లాలో పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టిన నుంచే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ పోలీస్ స్టేషన్ల పరిసరాలను సిబ్బందితో చర్చించడమే కాకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను ఏ విధంగా రిసీవ్ చేసుకుని వారిచ్చే కంప్లైంట్ పై రిసెప్షనిస్ట్ వివరాలు సేకరించి. కాoప్లెంట్ తీసుకొని ఇలాంటి చర్యలు తీసుకోవాలో ఏ విధంగా బాధితుల తో మేదలలో వివరించారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మారకపోవడంతో బాన్స్వాడ, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని అధికారులు సిబ్బంది అలర్ట్ అయ్యారు.

సామాజిక సేవ చేయడంతో పాటు పోలీస్ వ్యవస్థ కు మంచి పేరు తీసుకురావాలని ఈత బోధ సైతం చేశారు. తన పరిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని జిల్లా స్థాయి సమావేశంలో పోలీస్ బాస్ జిల్లాలోని పోలీసు అధికారులకు వివరించారు. ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకు వస్తే ఎలా పరిష్కరించాలో చర్చించుకుందాం అంటూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పనిచేసే అధికారులకు తాను వెన్నంటి ఉంటానని భరోసా కల్పించారు. దీంతో నిజాయితీగా పని చేసే అధికారులకు మరింత ప్రాణం పోసినట్లుంది. పోలీస్ స్టేషన్లకు వచ్చే కేసులను పరిష్కరించే ఇందుకు చొరవ చూపుతున్నారు. నిక్కచ్చిగా వ్యవహరించడం విధులు నిర్వహించినంతసేపు డ్యూటీ మైండ్ గా పనిచేయాలని హితవు పలికారు.

దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులలో మార్పు వచ్చింది. విధులు సక్రమంగా నిర్వహించడంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉదయం, సాయంత్రం రోల్ కాల్ చేస్తూ వీడియో పోలీస్ బాస్ కు పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతో గతంలో మొక్కుబడిగా సాగిన రోల్ కాల్ పరేడ్ నేడు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లలో  విధులు నిర్వహించే పోలీసులలో మార్పు వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వచ్చిన నుంచి మారుమూల మండలం సైతం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న మౌలిక వసతులు కల్పించడంతోపాటు పోలీస్ స్టేషన్లో సమస్యలు లేకుండా చూస్తున్నారు.

ప్రతి గ్రామానికి పోలీసు అధికారి

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు మహిళా సంఘాలు కు సంబంధించిన పూర్తి సమాచారం గ్రామ పోలీసు అధికారి వద్ద ఉండాలని ఆదేశాలు జాతి చేశారు. ప్రస్తుతం గ్రామ పోలీసు అధికారులు గ్రామంలో ఉన్న పూర్తి సమాచారాన్ని సేకరించి పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా ఇంటలిజెన్స్, ఎస్ బి విభాగాలను సైతం అప్రమత్తం చేశారు. ఏవైనా సంఘటనలు జరిగితే బాధ్యులను చేస్తానంటూ హెచ్చరిస్తూ విధుల్లో  నిర్లక్ష్యం చేసే వారిని గుర్తించి వారిని ఇతర శాఖలకు మార్చారు. మరి కొందరిని మార్చాలని భావిస్తున్నారు. జిల్లాలో ఎస్పీ రాజేష్ చంద్ర తన మార్కును ఉండే విధంగా పోలీస్ వ్యవస్థను చక్క దిద్దుతున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఎస్పీ సేవలను కొనియాడుతున్నారు.

సామాన్యులు నేరుగా ఎస్పీ వద్దకు...

నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి తమ సమస్యలను సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారు. సమస్యలతో వచ్చేవారి తో ఆయనే మాట్లాడి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతున్నారు. వచ్చిన 100 రోజులు లోనే పోలీస్ శాఖలో పెద్ద మార్పే వచ్చిందని ప్రజలంటున్నారు.

దాబాల్లో సెట్టింగ్లకు చెక్

దాబాలపై సిట్టింగులు చేస్తూ రోడ్డు ప్రమాదాల భారినపడి ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో దాబాల్లో సిట్టింగ్లు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పరిధిలోని       దాబాల యజమానులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేపట్టవద్దని సూచించారు.

ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టాలి 

 ట్రాఫిక్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రతి పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ పై ప్రత్యేక చొరవ తీసుకుంటే ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు తొలుగుతాయని పట్టణ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బాస్ ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే వంద రోజుల్లో ఎన్నో మార్పులు పోలీస్ శాఖలో తీసుకురావడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సేవలను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. 

నిక్కచ్చిగా విధులు నిర్వహిం చాలి 

ప్రతి పోలీస్ అధికారి నిక్కచ్చిగా వ్యవహరించి ప్రజలకు బాధితులకు సేవలు అందించాలన్నదే తన ధ్యేయం. ఎంతోమంది సామాన్యులు తమకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కు వస్తే వారి సమస్య కు  పరిష్కారం లభిస్తే  ఎంతో ఆనందిస్తారు. ప్రతి పోలీస్ అధికారిని గుర్తించుకుంటారు. ప్రతి నెల ఒక టాస్క్ ఏర్పాటు చేసి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం.

ఘ రాజేష్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి.