calender_icon.png 1 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలోనే అపశకునం.. అంగన్‌వాడీ కేంద్రానికి మోక్షమెప్పుడో?

01-07-2025 01:53:21 AM

స్లాబ్ పోశారు...  నిర్మాణం మరిచారు..

గంభీరావుపేట, జూన్ 30 (విజయ క్రాంతి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల కోసం నాణ్యమైన విద్యతో పాటు  ఆ రోగ్యం కోసం నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు ఆదిలోనే అపశకునం ఏర్పడుతుంది. గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ గ్రామంలో అంగన్వాడీ కేం ద్రం భవనాన్ని నిర్మించారు కానీ పూర్తి చేయ డం మర్చిపోయారు. స్లాబ్ మట్టుకు నిర్మా ణం చేసి వదిలేశారు. అద్దె భవనంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రంలో సరైన సౌక ర్యాలు లేక విద్యార్థులు, బాలింతలు అవస్థ లు పడుతున్నారు. సుమారు 5 సంవత్సారా లు గడుస్తున్న పనులు ప్రారంభించక పో వ డంతో భవనం చుట్టూ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి.

ఎండకు ఎండి, వానకు తడిసి భవనం శిథిలావస్థకు చేరుకుంది. అం గన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందుతుం దనే ఉద్దేశంతో తాము పిల్లలను పంపుతున్నామని, సరైన భవనాలు లేక తమ పిల్లలు పడుతున్న బాధలు చూడలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అంగన్వాడి కేంద్రాలలో గర్భిణులకు ప్రతిరోజు భోజనం పెట్టాల్సి ఉంటుంది, సరైన సౌకర్యాలు వారు కేంద్రాలకు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టిం చుకోవడం లేదని, ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని పనులు పూర్తి చేయించి , అంగన్ వాడి కేం ద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని పిల్లల తల్లితండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

మధ్యలోనే వదిలేశారు

‘సుమారు 6 సంవత్సరాల క్రితం ఈ భవనానికి శంకు స్థాపన చేశారు. స్లాబ్ మ ట్టుకు నిర్మించి ప నులు మధ్యలోనే వదిలేశారు. శాశ్వత భవనం లేకపోవడంతో పిల్లలు ఇ బ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోవడం లేదు. కలెక్టర్ చొరవ తీసుకొని పక్క భవనాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.    

    కొక్కు దేవేందర్ యాదవ్,  గ్రామస్తుడు