calender_icon.png 6 December, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్​సీసీ ద్వారా ఉద్యోగ అవకాశాల అంశంపై అవగాహన

06-12-2025 10:59:38 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా  కళాశాల (అటానమస్) లో "ఎన్​సీసీ ద్వారా ఉద్యోగ అవకాశాలు" అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎన్​సీసీలో చేరిన విద్యార్థులకు సీనియర్ క్యాడెట్స్ అభినందనలు తెలుపుతూ స్వాగతించారు.

కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి ఎన్ సి సి క్యాడెట్స్ భవిష్యత్తు వారికి ఉద్యోగ సముపార్జనకి ఎలా ఉపయోగపడుతోంది అని, ఎన్​సీసీ ద్వారా ఆర్మీ లోకి ఎలా వెళ్లొచ్చు మొదలైన విషయాలపై చాలా విలువైన సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రీ ఆర్డిసి క్యాంప్ కు ఎంపికైన తమ కళాశాల క్యాడెట్స్ కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. సుహాసిని, ఎన్ సి సి కేర్ టేకర్ ఆఫీసర్ డా. సువర్ణ, ఐక్యుఎసి కోఆర్డినేటర్ డా. సురేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి, అధ్యాపకులు పి.డి సుజాత, డా. పద్మ, డా. మాధవి కళాశాల ఎన్ సి సి క్యాడెట్స్, విద్యార్థినులు పాల్గొన్నారు.