calender_icon.png 19 October, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గా మల్లేశ్వరి పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ అధికారులు

19-10-2025 03:20:28 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని  మల్లాపూర్ డివిజన్లో దుర్గా మల్లేశ్వరి పోచమ్మ దేవాలయాన్ని  దేవాదాయ శాఖ అధికారులు సందర్శించారు. ఆలయ అభివృద్ధి మేరకు చాణిక్యపురి కాలనీ సంక్షేమ సంఘం  దేవాదాయ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ తెలంగాణ  ఏ సి పి చంద్రశేఖర్ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రణీత్  పరిశీల నిమిత్తం  సందర్శించారు. గత కొంతకాలంగా  దుర్గా మల్లేశ్వరి  పోచమ్మ దేవాలయంలో  నాగమణి అనే మహిళ  పూజలు నిర్వహించేది.

ఇటీవల కాలంలో  చాణిక్యపురి కాలనీ నూతన అసోసియేషన్ ఏర్పాటు అనంతరం దేవాలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ ఏర్పాటు చేసుకునేందుకు  దేవాదాయ ధర్మాదాయ శాఖకు  ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో అధికారులు  దేవాలయం సందర్శించి  కాలనీవాసుల నుండి   సూచనలు సలహాలు తీసుకొని నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని దేవాలయ సంబంధించిన అభివృద్ధి పనులను నూతన కమిటీ  చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని  కాళివాసులను సూచించారు. ఇప్పటివరకు దేవాలయ బాధ్యతలు నిర్వహించిన నాగమణిని కూడా కమిటీ మెంబర్ గా చేర్చుకొని  అభివృద్ధి చేయాలని  అధికారులు సూచించారు. కార్యక్రమంలో కాలు సంక్షేమ సంఘం నాయకులు  దశరథ్  కిషోర్ గౌడ్  నాగమణి  నరేష్ గంధమల రాములు గౌడ్  పాల్గొన్నారు