calender_icon.png 19 October, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యాసంస్థల పూర్వ వైభవానికి కలిసికట్టుగా పని చేద్దాం

19-10-2025 04:31:58 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): గురుకుల విద్యాసంస్థల పూర్వ వైభవానికి కలిసికట్టుగా పని చేద్దాం అని పూర్వ విద్యార్థులు, నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల విద్యసంస్థను కాపాడాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు గురుకుల గురించి పాటుపడే శ్రేయోభిలాషులు, బన్సీలాల్ వ్యాస్ కుటుంబ సభ్యులు, అభిమానులు, పూర్వ విద్యార్థులైన అంకం సురేష్ యాదవ్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై గురుకుల విద్యాసంస్థ పరిరక్షణ సమితి(జిపిఎస్) గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ గురుకులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కాకుండా పాఠశాలను, కళాశాలను నడిపించే విధంగా గురుకుల విద్యాసంస్థలు ఎండోమెంట్ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల అభిప్రాయాలు వారి ఆవేదనను తెలియజేస్తుంటే ప్రతి ఒక్కరి గుండెలను కదిలించాయి. ఈ గురుకుల విద్యసంస్థలో విద్య అభ్యసించడం వల్ల నేడు మేము మంచి ఉన్నత స్థితికి వచ్చామని కావున గురుకుల విద్యా సంస్థ కన్యాక్రాంతం కాకుండా పూర్వ వైభవానికి ప్రయత్నిస్తున్న తమతో మిగతా నాయకులు కలిసి పనిచేయడానికి రావాలని కోరారు. త్వరలో ఒక పుస్తక రూపంలో గురుకుల చరిత్రను ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నామని సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో గురుకుల పరిరక్షణ సమితిగా ఒక అడక్ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ఈ కమిటీ కార్యాచరణను ప్రకటిస్తుందని సమావేశం అభిప్రాయబడింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేసిన ప్రతి ఒక్కరికి అంకం సురేష్ యాదవ్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.