calender_icon.png 19 October, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్

19-10-2025 04:31:40 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించిన  బండి సంజయ్ ప్రజాస్వామ్యం పేరుతో ప్రసంగాలు చేస్తూ, మరోవైపు మావోయిస్టుల సాయుధ నెట్ వర్క్ లకు మద్దతు ఇస్తున్నా వారు వేంటనే మావోయిస్టులతో తమ సంబంధాలను తెంచుకోవాలన్నారు. ఒకవేళ సంబంధాలు తెంచుకోకపోతే మీ గుట్టు బయటపెడతామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టుల కట్టడితోనే కేంద్ర ఏజెన్సీలు ఆగిపోవని ఆయన పేర్కొన్నారు. అవినీతి, నేరగాళ్ల లింకులపై కేంద్రం నిఘా పెట్టిందని, ఎవరైనా, ఎంత పెద్దస్థాయిలో ఉన్నా వదిలిపెట్టేది లేదని బండి తెలిపారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పుడు మార్గంలో వెళితే ఎంత పెద్ద నేతనైనా వదిలిపెట్టమని చెప్పారు.