calender_icon.png 19 October, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

19-10-2025 04:35:14 PM

బైక్ ను ఢీకొన్న కారు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం వంజరిలో ఉంటున్న అక్కను పండుగకి వాంకిడి మండలం బెండరకు తమ్ముడు బైక్ పై తీసుకువస్తుండగా అతివేగంగా కారు ఢీకొనడంతో తమ్ముడితో పాటు అక్క, అల్లుడు మృతిచెందారు. కోడలు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో జగన్(27), అనసూర్య(32), ప్రజ్ఞశిల్(4) ఉన్నారు. పండగ పూట రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డలతో పాటు సోదరుడు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.