calender_icon.png 18 September, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

18-09-2025 10:27:57 AM

హైదరాబాద్: నగరంలోని పలుచోట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఈడీ దాడులు చేస్తోంది. బూర్గుల వెంకటేష్ అనే వ్యక్తి నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ లోని బురుగు విక్రాంత్ ఇంట్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు బంగారు వ్యాపారులే లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని దాదాపు 15 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది.