18-09-2025 11:03:39 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో(Renigunta Industrial Area) గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంలో రూ.70–80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.