calender_icon.png 18 September, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారు: రాహుల్ గాంధీ

18-09-2025 11:35:47 AM

ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతోనే చెబుతున్నా..

కావాలనే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారు..

న్యూఢిల్లీ: సెంట్రలైజ్డ్ సిస్టమ్(Centralized system) ఏర్పాటు చేసి ప్లాన్ ప్రకారమే ఓట్లు తొలగిస్తున్నారని, కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 6,800 ఓట్లు తొలగించారని, అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా పోతాయి? అని ప్రశ్నించారు.

ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు తొలగించాలంటూ వారికి తెలియకుండానే దరఖాస్తు చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ.. వివిధ రాష్ట్రాల నుంచి కొనసాగుతోందన్నారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతోనే చెబుతున్నా అన్నారు. కర్నాటక అలంద్ లో గోదాబాయి అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారని సూచించారు. గోదాబాయి మాట్లాడిన వీడియోను రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఓటు తొలగించాలని దరఖాస్తు చేయలేదని వీడియోలో గోదాబాయి చెప్పింది.

కర్నాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నంబర్లు వాడారు. ఈ నెంబర్లు ఎవరివి.. ఎవరు ఆపరేట్ చేశారో.. తేలాలన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయని పేర్కొన్నారు. ఓటు తొలగింపుపై వేదికపై రాహుల్ గాంధీ సూర్యకాంత్ తో మాట్లాడించారు. తనకు తెలియకుండానే ఓటు తొలగించాలని దరఖాస్తు చేశారని సూర్యకాంత్ వెల్లడించారు. 2 ఓట్లు తొలగించాలంటూ 36 సెకండ్లలో నాగరాజు పేరుతో దరఖాస్తు చేశారని చెప్పారు, ఫేక్ లాగిన్లు, ప్రత్యేక సాఫ్ట్ వేర్ తోనే ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కర్నాటకలో ఓట్ల తొలగింపుపై(Karnataka vote deletion) సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్న రాహుల్ గాంధీ ఈసీకి కర్నాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు రాసింది.. కానీ స్పందన లేదని తెలిపారు. ఎక్కణ్నుంచి దరఖాస్తు చేశారో ఐపీ నెంబర్లు ఇవ్వాలని సీఐడీ కోరిందన్నారు.ఆ ఫోన్లు ఏ ప్రాంతం నుంచే ఆపరేషన్ చేశారో సీఐడీ వివరాలు కోరింది. కర్నాటక సీఐడీ అడిగిన వివరాలను వారంలోకా ఇవ్వాలని ఈసీని కోరుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.