18-09-2025 09:41:52 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం(Burgampadu Mandal) సారపాక పంచాయతీ పరిధిలో మసీదు ఏరియాలో గత పది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న పింగళి శ్రీనివాస్, నవ్య శ్రీ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు. భర్త శ్రీనివాసరావు ఐటీసీ కర్మగారంలో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో భార్య నవ్య శ్రీ (28)కు అనారోగ్యంగా ఉందని వైద్యశాలకు తీసుకెళుతున్నట్టు భార్య తరపు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఉదయం వచ్చి భద్రాచలం ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి పరీక్షించగా కూతురు చనిపోయిందని నిర్ధారించుకుని తండ్రి కత్తి తిరుపతయ్య తన కూతురి మృతిపై ఆమె భర్త శ్రీనివాస్ పై అనుమానం ఉందని బుధవారం ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం మృతదేహాన్ని భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.