15 August, 2026 | 8:19 PM

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

25-05-2024 12:16 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన

టీజీ ఎప్‌సెట్ షెడ్యూల్ విడుదల

జూలై 12న మొదటి  విడుత సీట్లు కేటాయింపు

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూ ల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మొదటి విడుత కౌన్సెలింగ్ జూన్ 27 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 30 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

జూలై 12వ తేదీన మొదటి విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 19 నుంచి రెండో విడుత కౌన్సిలింగ్, అదే నెల 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. తుది విడుత కౌన్సెలింగ్‌ను జూలై 30న ప్రారంభం కానుండగా, ఆగస్టు 5న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 12న ఇంటర్నల్ స్లుడింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. ఈ ఒక్క ఏడాదే తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఏపీ విద్యార్థులు, ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఏపీ ఈపీసెట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనవచ్చు. 15 శాతం కోటా సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడనున్నారు.