దుండ్రపల్లిలో కొలతలు వేసిన ఇంజినీరింగ్ అధికారులు
అనుమతికి మించి నల్ల మట్టి తరలింపు
బోయినపల్లి, జూన్ 12 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో చెరువులో తీస్తున్న నల్లమట్టికి గురువారం ఇంజనీరింగ్ అధికారులు కొలతలు వేసి నల్ల మట్టి ఇంత తరలించారని లెక్కలు తీశారు. గురువారం విజయ క్రాంతి దినపత్రికలో మళ్లీ నల్ల మట్టి ఎత్తుకెళ్తున్నారు అనే శీర్షిక వచన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆ గ్రామంలో చెరువులో ఇంజనీరింగు అధికారులు ఇప్పటివరకు ఎంత మేరకు నల్లమట్టి తరలించాలని కొలతలు వేసి కొలిచారు.
సంబంధిత వ్యక్తి 500 క్యూబిక్ మీటర్ కు అనుమతులు తీసుకోగా అంతకుమించి రెండు వేల క్యూబిక్ మీటర్ల వరకు నల్ల మట్టి తరలించినట్లు వేసిన కొలతల్లో లెక్క తేలినట్టు తెలిసింది. కానీ ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు బయటకు రాకుండా ఉండేందుకు రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.






